తిరుపతి SVIMS లో భారీ నోటిఫికేషన్: స్టాఫ్ నర్స్, డ్రైవర్, DEO ఉద్యోగాలు.. పూర్తి వివరాలు | SVIMS Tirupati Recruitment 2026
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) నుండి ఒక మంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. తిరుపతి జిల్లాలో క్యాన్సర్ అవగాహన మరియు స్క్రీనింగ్ కార్యక్రమం (“Evaluation of Cancer Awareness and Screening programme”) అనే MRC ప్రాజెక్ట్ లో భాగంగా ఒక సంవత్సరం కాలపరిమితితో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ రకాల పోస్టుల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు చూసుకొని అర్హత ఉంటే డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళొచ్చు.
ముఖ్య గమనిక:
ఈ నోటిఫికేషన్‌కు కేవలం హిందూ మతానికి సంబందించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన వివరాలు (Key Details)
| సంస్థ పేరు (Organisation) | శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుపతి |
| ప్రాజెక్ట్ పేరు (Project Name) | MRC Project – Cancer Awareness & Screening Programme |
| మొత్తం ఖాళీలు (Total Vacancies) | 11 పోస్టులు |
| ఇంటర్వ్యూ తేదీలు (Interview Dates) | జూన్ 01, జూన్ 02, మరియు జూన్ 03, 2026 |
| దరఖాస్తు విధానం (Apply Mode) | వాక్-ఇన్-ఇంటర్వ్యూ (Walk-in-Interview) |
| గరిష్ట వయోపరిమితి (Upper Age Limit) | 42 సంవత్సరాలు (SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది) |
| ఉద్యోగ రకం (Job Type) | కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో (1 సంవత్సరం కాలపరిమితి) |
| జిల్లా (district) | అన్నీ జిల్లాల వారు |
latest andhra pradesh jobs ! apply now
ఉద్యోగాల వివరాలు (Post Details)
మెడికల్ ఆఫీసర్ (1 పోస్ట్ – మహిళలకు మాత్రమే):
నెలకు రూ.60,000 జీతం ఇస్తారు. MBBS లేదా BDS పూర్తి చేసి ఉండాలి. కమ్యూనిటీ ఆధారిత క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రాజెక్టులలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
స్టాఫ్ నర్స్ (1 పోస్ట్ – మహిళలకు మాత్రమే):
నెలకు రూ.38,700 జీతం లభిస్తుంది. B.Sc నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ (GNM) కోర్సు పూర్తి చేసి, ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. మూడేళ్ల అనుభవం అవసరం.
ANM (1 పోస్ట్ – మహిళలకు మాత్రమే):
నెలకు రూ.29,900 జీతం ఉంటుంది. టెన్త్ క్లాస్‌తో పాటు ANM లేదా MPHW కోర్సు పాసై ఉండాలి. ప్రభుత్వ లేదా కార్పొరేట్ ఆసుపత్రిలో కనీసం రెండేళ్ల అనుభవం మరియు ఏపీ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
మామోగ్రఫీ టెక్నీషియన్ (1 పోస్ట్ – మహిళలకు మాత్రమే):
నెలకు రూ.37,600 జీతం ఇస్తారు. B.Sc (ఇమేజింగ్ టెక్నాలజీ/రేడియోలాజికల్ టెక్నాలజీ) లేదా ఇంటర్ సైన్స్ గ్రూపుతో పాటు రేడియోలాజికల్ అసిస్టెంట్ సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. ఐదేళ్ల అనుభవం మరియు ఏపీ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ ఉండాలి.
కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్-II (1 పోస్ట్ – మహిళలకు మాత్రమే):
నెలకు రూ.37,600 జీతం ఉంటుంది. B.Sc కార్డియో-వాస్కులర్ టెక్నాలజీ లేదా B.Sc తో పాటు పీజీ డిప్లొమా ఇన్ కార్డియో వాస్కులర్ టెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి. కార్పొరేట్ ఆసుపత్రిలో ఏడాది అనుభవం మరియు ఏపీ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ (1 పోస్ట్ – మహిళలకు మాత్రమే):
నెలకు రూ.28,200 జీతం లభిస్తుంది. ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్ పరిజ్ఞానం మరియు ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్ టైప్‌రైటింగ్ పాసై ఉండాలి.
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (1 పోస్ట్ – పురుషులకు మాత్రమే):
నెలకు రూ.45,800 జీతం ఇస్తారు. ఏదైనా డిగ్రీతో పాటు పబ్లిక్ రిలేషన్స్‌లో పీజీ డిప్లొమా కలిగి ఉండాలి. కార్పొరేట్ ఆసుపత్రి లేదా మెడికల్ కాలేజీలో PROగా రెండేళ్ల అనుభవం అవసరం.
మెడికో సోషల్ వర్కర్ (1 పోస్ట్ – మహిళలకు మాత్రమే):
నెలకు రూ.45,800 జీతం ఉంటుంది. మెడికల్ అండ్ సైకియాట్రిక్ స్పెషలైజేషన్‌తో సోషల్ వర్క్ (MSW) లో పీజీ పూర్తి చేసి ఉండాలి. టెర్షియరీ ఆసుపత్రిలో ఏడాది అనుభవం ఉండాలి.
ఎలక్ట్రీషియన్ (1 పోస్ట్ – పురుషులకు మాత్రమే):
నెలకు రూ.32,600 జీతం ఇస్తారు. టెన్త్ క్లాస్‌తో పాటు ఐటీఐ (ITI) ఎలక్ట్రికల్ లేదా DEE పూర్తి చేసి, మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
డ్రైవర్లు (2 పోస్టులు – పురుషులకు మాత్రమే):
నెలకు రూ.27,500 జీతం లభిస్తుంది. టెన్త్ క్లాస్ పాసై ఉండి, హెవీ మోటార్ వెహికల్ (HMV) డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కనీసం రెండేళ్ల డ్రైవింగ్ అనుభవంతో పాటు సాధారణ కంటిచూపు (గ్లాసెస్ లేకుండా) కలిగి ఉండాలి. కనీస ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు ఉండాలి.
అర్హతలు (Eligibility)
మతపరమైన నిబంధన:
కేవలం హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి:
గరిష్ట వయస్సు 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ (SC) / ఎస్టీ (ST) అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది.
జెండర్ నిబంధన:
మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ANM, మామోగ్రఫీ టెక్నీషియన్, కార్డియోవాస్కులర్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు మెడికో సోషల్ వర్కర్ పోస్టులకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎలక్ట్రీషియన్, డ్రైవర్లు మరియు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
SVIMS Tirupati Recruitment 2026
ఎంపిక విధానం (Selection Process)
ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు SVIMS అధికారిక వెబ్‌సైట్ (https://svimstpt.ap.nic.in) నుండి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసిన ఫారమ్‌తో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు మరియు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో నేరుగా వాక్-ఇన్-ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.
ఇంటర్వ్యూ వేదిక: SVIMS Tirupati Recruitment 2026
కమిటీ హాల్, పాత డైరెక్టర్ కార్యాలయం, శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), అలిపిరి రోడ్, తిరుపతి – 517507.
రిపోర్టింగ్ సమయం:
ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు అనుమతించబడతాయి. ఆలస్యంగా వస్తే అనుమతించరు.
ఎలా అప్లై చేయాలి? (How to Apply)
ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు SVIMS అధికారిక వెబ్‌సైట్ (https://svimstpt.ap.nic.in
) నుండి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసిన ఫారమ్‌తో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు మరియు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో నేరుగా వాక్-ఇన్-ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.
SVIMS Tirupati Recruitment 2026
ముఖ్యమైన తేధీలు (Important dates)
పోస్టుల వారీగా ఇంటర్వ్యూ తేదీలు: SVIMS Tirupati Recruitment 2026
- 01.06.2026 (సోమవారం):
- మెడికల్ ఆఫీసర్, మెడికో సోషల్ వర్కర్, స్టాఫ్ నర్స్, ANM, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్.
- 02.06.2026 (మంగళవారం):
- డ్రైవర్లు.
- 03.06.2026 (బుధవారం):
- మామోగ్రఫీ టెక్నీషియన్, కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్-II, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్.
ముఖ్యమైన లింకులు (Important Links)
| అఫీషియల్ నోటిఫికేషన్ PDF (Official Notification) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
| అప్లికేషన్ లింక్ (Apply Off line) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
ముఖ్య గమనిక:
ఇంటర్వ్యూలు అవసరమైతే మరుసటి రోజు కూడా కొనసాగవచ్చు, కాబట్టి అభ్యర్థులు ఆ మేరకు సిద్ధమై రావాల్సి ఉంటుంది. ఎలాంటి టీఏ/డీఏ (ప్రయాణ భత్యాలు) చెల్లించబడవు. ఒకవేళ ఉద్యోగానికి ఎంపికైతే వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుంది.
SVIMS Tirupati Recruitment 2026
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్‌సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.




