విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఖాళీగా ఉన్న వివిధ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మూడు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉంటే పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాదించే ప్రయత్నం చేయండి. Visakhapatnam DLSA Recruitment 2026
ముఖ్యమైన వివరాలు (Key Details)
| organisation | జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విశాఖపట్నం (DLSA) |
| post name | టైపిస్ట్ కం అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మాన్ కం స్వీపర్ |
| total vacancies | 07 పోస్టులు |
| last date | 24-06-2026 సాయంత్రం 5:00 గంటల వరకు |
| qualification | 7వ తరగతి, 10వ తరగతి, డిగ్రీ (పోస్టును బట్టి) |
| salary | pay scale | APCOS నిబంధనల ప్రకారం రూ. 15,000/- నుండి రూ. 18,500/- |
| category | ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు (APCOS నియమ నిబంధనల ప్రకారం) |
| who will apply | అర్హత కలిగిన లోకల్ అభ్యర్థులు (18 నుండి 42 సంవత్సరాల వయస్సు గలవారు) |
latest government jobs 2026 – apply now!
ఉద్యోగాల వివరాలు (Post Details)
మొత్తం 07 ఖాళీల వివరాలు: Visakhapatnam DLSA Recruitment 2026
- టైపిస్ట్ కం అసిస్టెంట్: 01 పోస్టు (ఓపెన్ కేటగిరి – OC)
- రికార్డ్ అసిస్టెంట్: 02 పోస్టులు (ఓపెన్ కేటగిరి – OC)
- ఆఫీస్ సబార్డినేట్ (DLSA): 01 పోస్టు (ఓపెన్ కేటగిరి – OC)
- ఆఫీస్ సబార్డినేట్ (మీడియేషన్ సెంటర్): 02 పోస్టులు (ఓపెన్ కేటగిరి – OC)
- వాచ్మాన్ కం స్వీపర్: 01 పోస్టు (ఓపెన్ కేటగిరి – OC)
అర్హతలు (Eligibility)
టైపిస్ట్ కం అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, ఇంగ్లీష్ టైపింగ్ హయ్యర్ సర్టిఫికేట్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
రికార్డ్ అసిస్టెంట్: 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. Visakhapatnam DLSA Recruitment 2026
ఆఫీస్ సబార్డినేట్ & వాచ్మాన్ కం స్వీపర్: కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయస్సు: 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి (ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది).
ఎంపిక విధానం (Selection Process)
ఈ భర్తీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా మెరిట్, పని అనుభవం మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన జరుగుతుంది.
అర్హులైన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ, ధృవపత్రాల పరిశీలన మరియు టైపిస్ట్ పోస్టుకు అదనంగా టైప్ పరీక్ష నిర్వహించే తేదీలను విడిగా తెలియజేస్తారు. Visakhapatnam DLSA Recruitment 2026
ఎలా అప్లై చేయాలి? (How to Apply)
నోటిఫికేషన్ తో ఇవ్వబడిన దరఖాస్తు నమూనా ప్రకారం వివరాలన్నీ పూర్తి చేయాలి. Visakhapatnam DLSA Recruitment 2026
దరఖాస్తు ఫారానికి క్రింది ధృవీకరణ పత్రాల నకళ్ళను (జెరాక్స్ కాపీలను) జతపరచాలి:
- విద్యార్హతల ధృవపత్రాలు
- కుల ధృవీకరణ పత్రము
- రేషన్ కార్డు & ఆధార్ కార్డు
- పని అనుభవం ధృవపత్రము (ఉంటే)
- ఇతర అవసరమైన స్టడీ సర్టిఫికెట్లు.
పూర్తి చేసిన దరఖాస్తులను “కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విశాఖపట్నం” కార్యాలయ చిరునామాకు నిర్దేశిత సమయంలోపు కేవలం రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మాత్రమే పంపించాలి.
వ్యక్తిగతంగా లేదా నేరుగా ఇచ్చే దరఖాస్తులు స్వీకరించబడవు.
ముఖ్యమైన తేధీలు (Important dates)
నోటిఫికేషన్ విడుదల తేదీ: 10-06-2026
దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: 24-06-2026 సాయంత్రం 5:00 గంటల వరకు
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే ప్రయోజనాలు (Advantages)
ప్రభుత్వ విభాగమైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో పనిచేసే మంచి అవకాశం లభిస్తుంది.
APCOS నిబంధనల ప్రకారం స్థిరమైన వేతనం (రూ. 15,000/- నుండి రూ. 18,500/-) అందుతుంది.
కోర్టు పరిసరాలలో గౌరవప్రదమైన పని వాతావరణం ఉంటుంది. Visakhapatnam DLSA Recruitment 2026
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే లోపాలు (Disadvantages)
ఇవి పూర్తిగా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసే తాత్కాలిక ఉద్యోగాలు మాత్రమే.
ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులకు లభించే అదనపు అలవెన్సులు లేదా పెన్షన్ సదుపాయాలు వీరికి వర్తించవు.
ముఖ్యమైన లింకులు (Important Links)
📥 Download Official Notification PDF 2
📥 Download Official Notification PDF 3
📥 Official Website Click Here
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్‌సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.
Visakhapatnam DLSA Recruitment 2026 – తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు ఎంత ఉంటుంది?
నోటిఫికేషన్ లో ఎలాంటి దరఖాస్తు ఫీజు వివరాలు పేర్కొనలేదు, కాబట్టి అప్లికేషన్ ఉచితం.
దరఖాస్తులను నేరుగా ఆఫీసులో ఇవ్వవచ్చా?
లేదు, వ్యక్తిగతంగా లేదా నేరుగా ఇచ్చే దరఖాస్తులు తిరస్కరించబడతాయి. కేవలం రిజిస్టర్డ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మాత్రమే పంపాలి.
ఇతర జిల్లాల వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చా?
ఇది విశాఖపట్నం జిల్లా APCOS కమిటీ పరిధిలోని భర్తీ కాబట్టి, స్థానిక (లోకల్) అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం ఎన్ని రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు?
మొత్తం 4 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. అవి: టైపిస్ట్ కం అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, మరియు వాచ్మాన్ కం స్వీపర్.
ఎంపికైన వారికి నెలకు ఎంత జీతం ఇస్తారు?
టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టుకు: రూ. 18,500/-లు
రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, మరియు వాచ్మాన్ కం స్వీపర్ పోస్టులకు: రూ. 15,000/-లు (APCOS నియమ నిబంధనల ప్రకారం).




