ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కాకినాడ జిల్లాలో పారామెడికల్ మరియు సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. పూర్తి వివరాలు చూసి అర్హత ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాదించే ప్రయత్నం చేయండి. ap govt hospitals jobs recruitment 2026
ముఖ్యమైన వివరాలు (Key Details)
| organisation | సెకండరీ హెల్త్ డైరెక్టరేట్, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
| post name | ల్యాబ్ టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, GDA/MNO/FNO, పోస్ట్ మార్టం అసిస్టెంట్ |
| total vacancies | 12 పోస్టులు |
| last date | 30-06-2026 (సాయంత్రం 5:00 గంటల వరకు) |
| qualification | 10వ తరగతి, ఇంటర్మీడియట్, DMLT, B.Sc (MLT), డిప్లొమా (పోస్టును బట్టి) |
| salary | pay scale | పోస్టును బట్టి |
| category | కాంట్రాక్ట్ & అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు |
| who will apply | అర్హులైన కాకినాడ జిల్లా స్థానిక అభ్యర్థులు |
latest government jobs 2026 – apply now!
ఉద్యోగాల వివరాలు (Post Details)
కాకినాడ జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (CHC), ఏరియా ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు: ap govt hospitals jobs recruitment 2026
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II (Lab Technician Gr-II): 1 పోస్ట్ (కాంట్రాక్ట్ విధానం)
- డార్క్ రూమ్ అసిస్టెంట్ (Dark Room Assistant): 3 పోస్టులు (కాంట్రాక్ట్ విధానం)
- జనరల్ డ్యూటీ అటెండర్ (GDA/MNO/FNO): 7 పోస్టులు (అవుట్సోర్సింగ్ విధానం)
- పోస్ట్ మార్టం అసిస్టెంట్ (Post Mortem Assistant): 1 పోస్ట్ (అవుట్సోర్సింగ్ విధానం)
పోస్టును బట్టి జీతాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
GDA/MNO/FNO మరియు పోస్ట్ మార్టం అసిస్టెంట్: రూ. 15,000/-
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II: రూ. 32,670/-
డార్క్ రూమ్ అసిస్టెంట్: రూ. 28,220/-
అర్హతలు (Eligibility)
విద్యార్హతలు: ap govt hospitals jobs recruitment 2026
- ల్యాబ్ టెక్నీషియన్: ఇంటర్ (VOC MLT) లేదా DMLT లేదా B.Sc (MLT) ఉత్తీర్ణతతో పాటు APPMB లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి.
- డార్క్ రూమ్ అసిస్టెంట్: ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థ నుండి డార్క్ రూమ్ అసిస్టెంట్ ట్రైనింగ్ లేదా రేడియోలాజికల్/X-Ray టెక్నాలజీ (CRA/DMIT) డిప్లొమా కలిగి ఉండాలి.
- GDA/MNO/FNO & పోస్ట్ మార్టం అసిస్టెంట్: 10వ తరగతి (SSC) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: ap govt hospitals jobs recruitment 2026
- అభ్యర్థుల వయస్సు 01.01.2026 నాటికి గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు కలదు.
ఎంపిక విధానం (Selection Process)
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాతపరీక్ష లేదు. పూర్తిగా మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- అకడమిక్ మెరిట్: క్వాలిఫైయింగ్ పరీక్షలో సాధించిన మార్కులకు 75% వెయిటేజీ ఉంటుంది.
- సీనియారిటీ వెయిటేజీ: కోర్సు పూర్తి చేసిన సంవత్సరం నుండి ఏడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు ఇస్తారు.
- సర్వీస్ వెయిటేజీ: ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్/కోవిడ్-19 విధుల్లో పనిచేసిన వారికి గరిష్టంగా 15% వరకు వెయిటేజీ మార్కులు లభిస్తాయి.
ఎలా అప్లై చేయాలి? (How to Apply)
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ap govt hospitals jobs recruitment 2026
అప్లికేషన్‌ను పూర్తిగా నింపి, సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్లను (4వ తరగతి నుండి 10వ తరగతి వరకు) జతచేయాలి.
అప్లికేషన్ ఫీజు: OC అభ్యర్థులు రూ. 350/-, SC/ST/BC అభ్యర్థులు రూ. 250/- డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో "District Coordinator of Hospital Services, Kakinada District" పేరున చెల్లించాలి. (దివ్యాంగులకు ఫీజు మినహాయింపు కలదు).
పూర్తి చేసిన భౌతిక (Physical) దరఖాస్తులను O/o DCHS, కాకినాడ జిల్లా, DM&HO ఆఫీస్ కాంపస్, 3వ అంతస్తు, కాకినాడ లోని నిర్దేశిత కౌంటర్లలో సమర్పించాలి.
ముఖ్యమైన తేధీలు (Important dates)
నోటిఫికేషన్ విడుదల తేదీ: 18-06-2026
దరఖాస్తులు ప్రారంభం: 18-06-2026 (ఉదయం 10:00 గంటల నుండి)
దరఖాస్తుకు చివరి తేదీ: 30-06-2026 (సాయంత్రం 05:00 గంటల వరకు)
మెరిట్ లిస్ట్ కాలపరిమితి: 30-06-2027 వరకు చెల్లుబాటు అవుతుంది.
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే ప్రయోజనాలు (Advantages)
ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆసుపత్రులలో పనిచేసే మంచి అవకాశం లభిస్తుంది.
భవిష్యత్తులో వచ్చే రెగ్యులర్ నోటిఫికేషన్లలో ఇక్కడ చేసే సర్వీస్ వెయిటేజీ మార్కులుగా బాగా ఉపయోగపడుతుంది.
స్థానిక (కాకినాడ) జిల్లాలోనే విధి నిర్వహణ ఉంటుంది. ap govt hospitals jobs recruitment 2026
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే లోపాలు (Disadvantages)
ఇవి కేవలం కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసే తాత్కాలిక ఉద్యోగాలు మాత్రమే.
ప్రాథమికంగా కేవలం ఒక సంవత్సరం కాలపరిమితికి మాత్రమే నియామకం జరుగుతుంది (ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పొడిగించే అవకాశం ఉంది).
| ముఖ్యమైన లింకులు (Important Links) | లింక్ |
|---|---|
| అఫీషియల్ నోటిఫికేషన్ PDF (Official Notification) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
| అఫిసియల్ వెబ్సైట్ లింక్ (Official website) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.
ap govt hospitals jobs recruitment 2026 – తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
ఈ ఉద్యోగాలకు ఇతర జిల్లాల వారు అప్లై చేయవచ్చా?
ఈ రిక్రూట్మెంట్ పరిధి కేవలం కాకినాడ జిల్లాకు మాత్రమే పరిమితం చేయబడింది. కావున స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తులను ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చా?
లేదు, అప్లికేషన్ ఫారమ్‌ను వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసి, కాకినాడలోని DCHS కార్యాలయంలో నేరుగా భౌతికంగా మాత్రమే సమర్పించాలి.
ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చా?
అవును, అర్హత ఉన్న అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రతి పోస్టుకు విడివిడిగా అప్లికేషన్ ఫారమ్ మరియు విడివిడిగా డిమాండ్ డ్రాఫ్ట్ (DD) సమర్పించాల్సి ఉంటుంది.



