ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University), విశాఖపట్నం హెల్త్ సెంటర్ మరియు హోమియో డిస్పెన్సరీలో ఖాళీగా ఉన్న వివిధ వైద్య విభాగాల ఉద్యోగాల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు చూసి అర్హత ఉంటే ఇంటర్వ్యూ కి వెళ్లి ఒక ఉద్యోగాన్ని సాదించండి. Andhra University Recruitment 2026
ముఖ్యమైన వివరాలు (Key Details)
| organisation | ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University), విశాఖపట్నం |
| post name | మెడికల్ ఆఫీసర్, హోమియో మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్, స్ట్రెచర్ బాయ్ |
| total vacancies | 10 పోస్టులు |
| last date | 19-06-2026 (interview date) |
| qualification | పోస్టును బట్టి SSC, డిప్లొమా, డిగ్రీ, MBBS, BHMS |
| salary | pay scale | పోస్టును బట్టి (గౌరవ వేతనం పద్ధతిన) |
| category | యూనివర్సిటీ ఉద్యోగాలు (తాత్కాలిక ప్రాతిపదికన) |
| who will apply | అర్హత మరియు సరైన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు కలిగిన అభ్యర్థులు |
latest government jobs 2026 – apply now!
ఉద్యోగాల వివరాలు (Post Details)
మెడికల్ ఆఫీసర్ (Medical Officer): 3 పోస్టులు (జీతం: నెలకు రూ. 40,000/-) Andhra University Recruitment 2026
హోమియో మెడికల్ ఆఫీసర్ (Homoeo Medical Officer): 1 పోస్టు (జీతం: నెలకు రూ. 40,000/-)
ఫార్మసిస్ట్ (Pharmacist): 4 పోస్టులు (జీతం: నెలకు రూ. 20,000/-)
స్టాఫ్ నర్స్ (Staff Nurse): 1 పోస్టు (జీతం: నెలకు రూ. 20,000/-)
స్ట్రెచర్ బాయ్ (Stretcher Boy): 1 పోస్టు (జీతం: నెలకు రూ. 12,000/-)
అర్హతలు (Eligibility)
మెడికల్ ఆఫీసర్: MBBS తో పాటు మెడికల్ కౌన్సిల్లో గుర్తింపు పొందిన రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
హోమియో మెడికల్ ఆఫీసర్: BHMS తో పాటు మెడికల్ కౌన్సిల్లో గుర్తింపు పొందిన రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
ఫార్మసిస్ట్: D.Pharm లేదా B.Pharm తో పాటు ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి.
స్టాఫ్ నర్స్: B.Sc Nursing లేదా GNM కోర్సు పూర్తి చేసి, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
స్ట్రెచర్ బాయ్: SSC లేదా తత్సమాన విద్యార్హతతో పాటు బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) సర్టిఫికేట్ ఉండాలి.
హాస్పిటల్స్ లేదా హెల్త్ సెంటర్లలో సంబంధిత అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఎంపిక విధానం (Selection Process)
అభ్యర్థుల ఎంపిక క్రింది అంశాల ఆధారంగా జరుగుతుంది: Andhra University Recruitment 2026
- అకడమిక్ అర్హతలు (Academic Qualifications)
- అనుభవం (Experience)
- ఇంటర్వ్యూలో చూపే ప్రతిభ (Performance in the Interview)
ఎలా అప్లై చేయాలి? (How to Apply)
ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ కావున అభ్యర్థులు ముందే ఆన్లైన్లో అప్లై చేయనవసరం లేదు. కింద పేర్కొన్న పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూ వేదికకు హాజరుకావలసి ఉంటుంది: Andhra University Recruitment 2026
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్
- అన్ని ఒరిజినల్ విద్యార్హత మరియు అనుభవ ధృవీకరణ పత్రాలు
- ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ (Self-attested) జిరాక్స్ కాపీలు
- కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు (వర్తించే పోస్టులకు)
- ఆధార్ కార్డ్ కాపీ
- రెండు ఇటీవలి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
ముఖ్యమైన తేధీలు (Important dates)
నోటిఫికేషన్ విడుదలైన తేదీ: 08-06-2026 Andhra University Recruitment 2026
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 19-06-2026
సమయం: ఉదయం 10.30 గంటల నుండి
ఇంటర్వ్యూ వేదిక: ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం.
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే ప్రయోజనాలు (Advantages)
ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ సంస్థలో పనిచేసే అవకాశం లభిస్తుంది.
వైద్య మరియు ఆరోగ్య రంగంలో మంచి పని అనుభవం (Work Experience) లభిస్తుంది, ఇది భవిష్యత్తులో ఇతర ఉద్యోగాలకు ఎంతో ఉపయోగపడుతుంది. Andhra University Recruitment 2026
ఎంపిక ప్రక్రియ చాలా వేగంగా (నేరుగా ఇంటర్వ్యూ ద్వారా) జరుగుతుంది.
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే లోపాలు (Disadvantages)
ఈ నియామకం పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన (Temporary / Consolidated pay basis) మాత్రమే ఉంటుంది.
ప్రాథమిక ఒప్పంద కాలం కేవలం 11 నెలలు మాత్రమే ఉంటుంది (అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది).
యూనివర్సిటీలో శాశ్వత/రెగ్యులర్ ఉద్యోగం కోసం ఎలాంటి హక్కులను అభ్యర్థులు డిమాండ్ చేయలేరు.
ఎంపికైన అభ్యర్థులు నైట్ డ్యూటీలతో సహా షిఫ్ట్ పద్ధతిలో పనిచేయాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూకు హాజరవడానికి ఎలాంటి TA/DA అలవెన్సులు ఇవ్వబడవు.
| ముఖ్యమైన లింకులు (Important Links) | లింక్ |
|---|---|
| అఫీషియల్ నోటిఫికేషన్ PDF (Official Notification) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
| అఫిసియల్ వెబ్సైట్ లింక్ (Official website) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.
Andhra University Recruitment 2026 – తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
ఈ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలా?
కావు. ఇవి పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన 11 నెలల కాలపరిమితికి ఒప్పంద వేతనంపై భర్తీ చేస్తున్న పోస్టులు.
ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది?
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లోని 'ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్' లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది?
ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. అభ్యర్థులు నోటిఫికేషన్‌తో పాటు ఇచ్చిన ఫారమ్‌ను పూర్తి చేసి నేరుగా హాజరుకావచ్చు.
ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఏ ఏ సర్టిఫికేట్లు తీసుకువెళ్లాలి?
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్
SSC సర్టిఫికేట్ (పుట్టిన తేదీ ధృవీకరణ కోసం)
సంబంధిత విద్యార్హత సర్టిఫికేట్లు
మెడికల్/నర్సింగ్/ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (స్ట్రెచర్ బాయ్ మినహా మిగిలిన పోస్టులకు)
బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) సర్టిఫికేట్ (స్ట్రెచర్ బాయ్ పోస్టుకు మాత్రం)
ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు (ఉంటే)
ఆధార్ కార్డ్ కాపీ మరియు రెండు ఇటీవలి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
స్ట్రెచర్ బాయ్ పోస్టుకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తప్పనిసరా?
లేదు, ఎక్స్పీరియన్స్ తప్పనిసరి కాదు. అయితే, నోటిఫికేషన్ ప్రకారం హాస్పిటల్స్ లేదా హెల్త్ సెంటర్లలో సంబంధిత పని అనుభవం ఉన్నవారికి ఎంపికలో ప్రాధాన్యత (Preference) ఇవ్వబడుతుంది.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది? ఏవైనా రాత పరీక్షలు ఉంటాయా?
లాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల అకడమిక్ మార్కులు, అనుభవం మరియు వాక్-ఇన్ ఇంటర్వ్యూలో ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.



