తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుపతి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అర్హులైన హిందూ మతస్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. SVIMS Staff Nurse Recruitment 2026
ముఖ్యమైన వివరాలు (Key Details)
| organisation | శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుపతి |
| post name | స్టాఫ్ నర్స్ (Staff Nurse) |
| total vacancies | 36 పోస్టులు (బ్యాక్‌లాగ్: 24, రెగ్యులర్: 212) |
| last date | 10 ఆగస్టు 2026 (రాత్రి 11:59 గంటల వరకు) |
| qualification | B.Sc Nursing (లేదా) Intermediate తో పాటు GNM + 3 ఏళ్ల అనుభవం మరియు AP నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ |
| salary | pay scale | రూ. 38,720 – రూ. 1,18,390/- (RPS 2022 ప్రకారం) |
| category | ప్రభుత్వ ఉద్యోగాలు (AP State ROR / TTD నిబంధనల ప్రకారం) |
| who will apply | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మతస్థులు మాత్రమే అర్హులు |
latest government jobs 2026 – apply now!
ఉద్యోగాల వివరాలు (Post Details)
మొత్తం ఖాళీలు: 236 SVIMS Staff Nurse Recruitment 2026
- బ్యాక్‌లాగ్ ఖాళీలు (24): BC-A (2), BC-B (3), BC-D (5), ST (14).
- రెగ్యులర్ ఖాళీలు (212): OC (88), EWS (23), BC-A (15), BC-B (24), BC-D (16), BC-E (2), SC (31), ST (13).
అర్హతలు (Eligibility)
విద్యార్హత: SVIMS Staff Nurse Recruitment 2026
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.Sc (Nursing) ఉత్తీర్ణత మరియు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి.
- (లేదా) ఇంటర్మీడియట్ తో పాటు 3 ఏళ్ల జనరల్ నర్సింగ్ కోర్స్ (GNM) మరియు 6 నెలల మిడ్‌వైఫరీ ట్రైనింగ్ పూర్తి చేసి, కనీసం 500 బెడ్స్ గల మెడికల్ కాలేజ్/ఆసుపత్రిలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి (01-07-2026 నాటికి): SVIMS Staff Nurse Recruitment 2026
- కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు ఉండాలి.
- SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది. గరిష్ట వయస్సు అన్ని సడలింపులతో కలిపి 52 సంవత్సరాలు మించకూడదు.
ఇతర నిబంధన: అభ్యర్థులు ఖచ్చితంగా హిందూ మతానికి చెందినవారై ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ స్థానికులై ఉండాలి.
ఎంపిక విధానం (Selection Process)
మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది: SVIMS Staff Nurse Recruitment 2026
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): 75 మార్కులు (90 నిమిషాల వ్యవధి, నెగెటివ్ మార్కులు లేవు, ప్రశ్నపత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది).
- అనుభవం (Experience Weightage): గరిష్టంగా 15 మార్కులు (ప్రభుత్వ/సెమీ-గవర్నమెంట్/కనీసం 500 బెడ్స్ గల ఆసుపత్రులలో ప్రతి 6 నెలల సర్వీస్‌కు 1 మార్కు చొప్పున ఇస్తారు).
- ఇంటర్వ్యూ: 10 మార్కులు.
- గమనిక: దరఖాస్తులు 10 కంటే తక్కువ వస్తే అకాడమిక్ మార్కులు, అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేయాలి? (How to Apply)
అర్హులైన అభ్యర్థులు SVIMS అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. SVIMS Staff Nurse Recruitment 2026
వెబ్‌సైట్‌లోని ‘Jobs’ ట్యాబ్‌కు వెళ్లి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపాలి.
విద్యార్హత పత్రాలు, AP నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, స్టడీ/రెసిడెన్స్ సర్టిఫికేట్లు మరియు అనుభవ ధృవీకరణ పత్రాలను స్పష్టమైన స్కాన్ కాపీలుగా అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తు రుసుము: OC/EWS అభ్యర్థులకు రూ. 2360/-, BC/SC/ST అభ్యర్థులకు రూ. 1770/-. PwBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కలదు. ఫీజును ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించవచ్చు.
ముఖ్యమైన తేధీలు (Important dates)
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 15.07.2026
దరఖాస్తుకు చివరి తేదీ: 10.08.2026 (రాత్రి 11:59 వరకు)
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే ప్రయోజనాలు (Advantages)
ఇది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనుబంధ సంస్థ అయిన ప్రతిష్టాత్మక SVIMS లో స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం. SVIMS Staff Nurse Recruitment 2026
ఆకర్షణీయమైన పే-స్కేల్ (రూ. 38,720 – రూ. 1,18,390/-) తో పాటు ఇతర ప్రభుత్వ అలవెన్సులు లభిస్తాయి.
అత్యాధునిక వైద్య సౌకర్యాలు గల టెర్షియరీ కేర్ ఆసుపత్రిలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకునే అవకాశం ఉంటుంది.
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే లోపాలు (Disadvantages)
షిఫ్ట్ డ్యూటీలు మరియు అత్యవసర సమయాల్లో అదనపు గంటలు పనిచేయాల్సి ఉంటుంది. SVIMS Staff Nurse Recruitment 2026
కేవలం తిరుపతి (SVIMS) లో మాత్రమే పోస్టింగ్ ఉంటుంది, ఇతర జిల్లాలకు బదిలీల అవకాశం ఉండదు.
రోగుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
| ముఖ్యమైన లింకులు (Important Links) | లింక్ |
|---|---|
| అఫీషియల్ నోటిఫికేషన్ PDF (Official Notification) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
| అఫిసియల్ వెబ్సైట్ లింక్ (Official Website Link) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్‌సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.
SVIMS Staff Nurse Recruitment 2026 – తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
ఈ ఉద్యోగాలకు ఇతర రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చా?
లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానికత (Nativity) కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.
హిందూయేతర మతస్తులు ఈ ఉద్యోగాలకు అర్హులా?
లేదు, TTD నిబంధనల (TTD Employees Service Rules, 1989) ప్రకారం కేవలం హిందూ మతాన్ని అవలంబించే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఎప్పుడు?
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 10 ఆగస్టు 2026 రాత్రి 11:59 గంటల వరకు.
ఎంపిక విధానంలో నెగెటివ్ మార్కులు ఉన్నాయా?
లేదు, 75 మార్కులకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు.
GNM చేసిన వారికి అనుభవం తప్పనిసరా?
అవును, జనరల్ నర్సింగ్ (GNM) కోర్సు చేసిన అభ్యర్థులకు కనీసం 500 బెడ్స్ ఉన్న మెడికల్ కాలేజ్ లేదా టెర్షియరీ కేర్ ఆసుపత్రిలో 3 సంవత్సరాల పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. B.Sc Nursing చేసిన వారికి అనుభవం అవసరం లేదు.




