భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (RRBs) పారామెడికల్ కేటగిరీల కింద వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి కేంద్రీకృత ఉపాధి నోటిఫికేషన్ (CEN 05/2026) విడుదల చేశాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కింద ఇవ్వబడింది. RRB Paramedical Recruitment 2026
ముఖ్యమైన వివరాలు (Key Details)
| organisation | Railway Recruitment Boards (RRBs), Ministry of Railways |
| post name | Nursing Superintendent, Pharmacist, Lab Assistant Gr. II & Other Paramedical Posts |
| total vacancies | 590 |
| last date | 14.10.2026 (23:59 hours) |
| qualification | 10+2, Diploma / Degree in relevant Paramedical discipline (GNM, B.Sc Nursing, B.Pharm, D.Pharm, DMLT, etc.) |
| salary | pay scale | Pay Level 3 to Level 7 (Rs. 21,700 – Rs. 44,900/- ప్రారంభ బేసిక్ పే + అలవెన్సులు) |
| category | Central Government Jobs / Railway Jobs |
| who will apply | భారత పౌరులు (All India Male & Female eligible candidates) |
latest government jobs 2026 – apply now!
ఉద్యోగాల వివరాలు (Post Details)
ఈ నోటిఫికేషన్ (CEN 05/2026) ద్వారా భర్తీ చేస్తున్న పారామెడికల్ పోస్టుల పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి: RRB Paramedical Recruitment 2026
- 1. నర్సింగ్ సూపరింటెండెంట్ (Nursing Superintendent):
- మొత్తం ఖాళీలు: 365
- పే లెవల్ (7th CPC): లెవల్ 7
- ప్రారంభ బేసిక్ పే: ₹44,900/-
- వయస్సు (01-01-2027 నాటికి): 20 నుండి 40 సంవత్సరాలు
- 2. డయాలసిస్ టెక్నీషియన్ (Dialysis Technician):
- మొత్తం ఖాళీలు: 01
- పే లెవల్ (7th CPC): లెవల్ 6
- ప్రారంభ బేసిక్ పే: ₹35,400/-
- వయస్సు (01-01-2027 నాటికి): 20 నుండి 33 సంవత్సరాలు
- 3. హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్-II (Health & Malaria Inspector Gr II):
- మొత్తం ఖాళీలు: 43
- పే లెవల్ (7th CPC): లెవల్ 6
- ప్రారంభ బేసిక్ పే: ₹35,400/-
- వయస్సు (01-01-2027 నాటికి): 18 నుండి 33 సంవత్సరాలు
- 4. ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్ (Audiologist & Speech Therapist):
- మొత్తం ఖాళీలు: 01
- పే లెవల్ (7th CPC): లెవల్ 6
- ప్రారంభ బేసిక్ పే: ₹35,400/-
- వయస్సు (01-01-2027 నాటికి): 21 నుండి 30 సంవత్సరాలు
- 5. ఫార్మసిస్ట్ – ఎంట్రీ గ్రేడ్ (Pharmacist – Entry Grade):
- మొత్తం ఖాళీలు: 118
- పే లెవల్ (7th CPC): లెవల్ 5
- ప్రారంభ బేసిక్ పే: ₹29,200/-
- వయస్సు (01-01-2027 నాటికి): 20 నుండి 35 సంవత్సరాలు
- 6. రేడియోలాజిస్ట్ / ఎక్స్-రే టెక్నీషియన్ (Radiographer X-Ray Technician):
- మొత్తం ఖాళీలు: 25
- పే లెవల్ (7th CPC): లెవల్ 5
- ప్రారంభ బేసిక్ పే: ₹29,200/-
- వయస్సు (01-01-2027 నాటికి): 19 నుండి 33 సంవత్సరాలు
- 7. ఈసీజీ టెక్నీషియన్ (ECG Technician):
- మొత్తం ఖాళీలు: 04
- పే లెవల్ (7th CPC): లెవల్ 4
- ప్రారంభ బేసిక్ పే: ₹25,500/-
- వయస్సు (01-01-2027 నాటికి): 18 నుండి 33 సంవత్సరాలు
- 8. ఆప్టోమెట్రిస్ట్ (Optometrist):
- మొత్తం ఖాళీలు: 02
- పే లెవల్ (7th CPC): లెవల్ 4
- ప్రారంభ బేసిక్ పే: ₹25,500/-
- వయస్సు (01-01-2027 నాటికి): 18 నుండి 33 సంవత్సరాలు
- 9. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-II (Lab Assistant Gr. II):
- మొత్తం ఖాళీలు: 31
- పే లెవల్ (7th CPC): లెవల్ 3
- ప్రారంభ బేసిక్ పే: ₹21,700/-
- వయస్సు (01-01-2027 నాటికి): 18 నుండి 33 సంవత్సరాలు
🔹 మొత్తం ఖాళీల సంఖ్య: 590 పోస్టులు
అర్హతలు (Eligibility)
విద్యా అర్హతలు: సంబంధిత పోస్టును బట్టి ఇంటర్మీడియట్ (సైన్స్ గ్రూప్) తో పాటు సంబంధిత రంగంలో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి (ఉదాహరణకు: నర్సింగ్కు GNM/B.Sc Nursing; ఫార్మసిస్ట్‌కు B.Pharm/D.Pharm; ల్యాబ్ అసిస్టెంట్‌కు DMLT లేదా B.Sc MLT). దరఖాస్తు ముగింపు తేదీ (14.10.2026) నాటికి అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి (ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు అర్హులు కారు). RRB Paramedical Recruitment 2026
వయస్సు సడలింపు (గరిష్ట వయస్సులో): ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ (NCL) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు 10 నుండి 15 సంవత్సరాల వరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. RRB Paramedical Recruitment 2026
ఎంపిక విధానం (Selection Process)
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT): 100 ప్రశ్నలతో 90 నిమిషాల వ్యవధి గల ఆబ్జెక్టివ్ పరీక్ష నిర్వహించబడుతుంది. ఇందులో ప్రొఫెషనల్ ఎబిలిటీ (70 మార్కులు), జనరల్ అవేర్నెస్ (10 మార్కులు), అర్థమెటిక్ & రీజనింగ్ (10 మార్కులు), జనరల్ సైన్స్ (10 మార్కులు) ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. RRB Paramedical Recruitment 2026
డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV): CBT మెరిట్ ఆధారంగా 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు.
మెడికల్ ఎగ్జామినేషన్ (ME): సంబంధిత పోస్టుకు నిర్దేశించిన మెడికల్ ప్రమాణాల (B1, C1, C2) ప్రకారం రైల్వే ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
ఎలా అప్లై చేయాలి? (How to Apply)
రైల్వే అధికారిక రిక్రూట్మెంట్ పోర్టల్ ను సందర్శించండి. RRB Paramedical Recruitment 2026
గతంలో అకౌంట్ లేనివారు ‘Create an Account’ ద్వారా ప్రాథమిక వివరాలు నమోదు చేసి ఖాతా తెరవండి.
ఒకే ఒక్క RRB ని ఎంచుకుని, అర్హత గల పోస్టుల ప్రాధాన్యతను (Preferences) నమోదు చేయండి.
వెబ్‌క్యామ్ లేదా ఫోన్ ఫ్రంట్ కెమెరా ద్వారా లైవ్ ఫోటో క్యాప్చర్ చేయండి.
నిర్దేశిత ఫార్మాట్లో సంతకం (నలుపు సిరాతో చేసినది), అవసరమైతే కమ్యూనిటీ సర్టిఫికెట్‌ను అప్లోడ్ చేయండి.
ఆన్లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా నిర్ణీత దరఖాస్తు రుసుము చెల్లించి, దరఖాస్తును ఫైనల్ సబ్మిట్ చేసి ప్రింటౌట్ భద్రపరుచుకోండి. RRB Paramedical Recruitment 2026
ముఖ్యమైన తేధీలు (Important dates)
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 15.09.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.10.2026 (రాత్రి 23:59 వరకు)
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 16.10.2026
దరఖాస్తు సవరణ (Modification Window): 17.10.2026 నుండి 26.10.2026 వరకు
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే ప్రయోజనాలు (Advantages)
కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగం, సర్వీస్ భద్రత మరియు మెరుగైన వేతన స్కేలు. RRB Paramedical Recruitment 2026
ఉచిత రైల్వే పాస్‌లు, పీటీవోలు (PTO), ఉచిత రైల్వే వైద్య సదుపాయాలు మరియు ఇతర అలవెన్సులు.
రైల్వే ఆసుపత్రులు మరియు హెల్త్ యూనిట్లలో ప్రొఫెషనల్ పని వాతావరణం, ప్రమోషన్ అవకాశాలు.
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే లోపాలు (Disadvantages)
ఎమర్జెన్సీ మరియు షిఫ్ట్ డ్యూటీలు (రాత్రి డ్యూటీలతో సహా) చేయాల్సి రావడం. RRB Paramedical Recruitment 2026
నిబంధనల ప్రకారం ప్రారంభంలో 5 నుండి 10 సంవత్సరాల వరకు ఇతర రైల్వే జోన్లకు బదిలీ చేసుకునే అవకాశం ఉండదు.
ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ ఉండటం వల్ల ఎంపికైన జోన్ పరిధిలోని ఏ విభాగంలోనైనా పనిచేయాల్సి రావడం.
| ముఖ్యమైన లింకులు (Important Links) | లింక్ |
|---|---|
| అఫీషియల్ నోటిఫికేషన్ PDF (Official Notification) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
| అప్లికేషన్ లింక్ (Application Link) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.
RRB Paramedical Recruitment 2026 – తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
RRB పారామెడికల్ 2026 నోటిఫికేషన్లో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 590 పారామెడికల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
దరఖాస్తు రుసుము ఎంత మరియు రీఫండ్ లభిస్తుందా?
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు ₹500/- రుసుము ఉంటుంది (CBT పరీక్షకు హాజరైతే బ్యాంక్ ఛార్జీలు మినహాయించి ₹400/- రీఫండ్ చేస్తారు). ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, EBC మరియు PwBD అభ్యర్థులకు ఫీజు ₹250/- (CBT పరీక్షకు హాజరైతే పూర్తి మొత్తం రీఫండ్ అవుతుంది).
అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ RRB లకు దరఖాస్తు చేసుకోవచ్చా?
చేసుకోకూడదు. అభ్యర్థి ఏదైనా ఒక RRB ని మాత్రమే ఎంచుకుని ఆన్లైన్ దరఖాస్తు సమర్పించాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పిస్తే అన్ని దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
ఎంపిక పరీక్షలో నెగటివ్ మార్కింగ్ విధానం ఉందా?
అవును, CBT పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నిర్దేశిత మార్కులో 1/3 వంతు మార్కు కోత విధించబడుతుంది.




