ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన విశాఖపట్నం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి (DM&HO) కార్యాలయం నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (PHCs) కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాదించే ప్రయత్నం చేయండి. ap health department jobs 2026
ముఖ్యమైన వివరాలు (Key Details)
| organisation | ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (DMHO విశాఖపట్నం) |
| post name | ల్యాబ్ టెక్నీషియన్ Gr. II, FNO, శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మన్ |
| total vacancies | 18 పోస్టులు (3 + 4 + 11) |
| last date | 30-06-2026 సాయంత్రం 05:00 గంటల లోపు |
| qualification | 10వ తరగతి (SSC), DMLT, B.Sc (MLT), ఇంటర్ (Vocational) |
| salary | pay scale | పోస్టుని అనుసరించి |
| category | కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు |
| who will apply | అర్హత మరియు ఆసక్తి గల ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు |
latest government jobs 2026 – apply now!
ఉద్యోగాల వివరాలు (Post Details)
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పోస్టుల వారీగా వివరాలు:
- ల్యాబ్ టెక్నీషియన్ Gr. II (కాంట్రాక్ట్): 3 పోస్టులు – వేతనం రూ. 32,670/-
- FNO (ఔట్సోర్సింగ్): 4 పోస్టులు – వేతనం రూ. 15,000/-
- శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మన్ (ఔట్సోర్సింగ్): 11 పోస్టులు – వేతనం రూ. 15,000/-
అర్హతలు (Eligibility)
విద్యా అర్హతలు: ap health department jobs 2026
- ల్యాబ్ టెక్నీషియన్ Gr. II: DMLT లేదా B.Sc (MLT) ఉత్తీర్ణత. ఒకవేళ ఇంటర్మీడియట్ Vocational MLT అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఏడాది అప్రెంటిస్‌షిప్ చేసి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా APPMB (ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డ్) లో యాక్టివ్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
- FNO: 10వ తరగతి (SSC) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫస్ట్ ఎయిడ్ (ప్రథమ చికిత్స) సర్టిఫికేట్ తప్పనిసరి.
- శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మన్: 10వ తరగతి (SSC) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
వయోపరిమితి (01/01/2026 నాటికి): ap health department jobs 2026
- కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి.
- సడలింపులు: SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు (PBD) 10 సంవత్సరాలు; మాజీ సైనికోద్యోగులకు సేవ కాలంతో పాటు అదనంగా 3 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం (Selection Process)
ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ మరియు ప్రభుత్వ రిజర్వేషన్ రూల్స్ (ఎస్సీ ఉప-వర్గీకరణతో సహా) ఆధారంగా జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు లెక్కింపు ఉంటుంది: ap health department jobs 2026
- అర్హత పరీక్ష మార్కులు (Qualifying Exam): 75 మార్కులు.
- కోర్సు పాసైన సంవత్సరం వెయిటేజీ: గరిష్టంగా 10 మార్కులు (సంవత్సరానికి 1 మార్కు చొప్పున).
- ప్రభుత్వ కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ సర్వీస్ వెయిటేజీ: గరిష్టంగా 15 మార్కులు (గిరిజన ప్రాంతం: 6 నెలలకు 2.5; గ్రామీణ: 2.0; పట్టణ: 1.0 మార్కులు).
- కోవిడ్-19 ప్రత్యేక వెయిటేజీ: ప్రతి 6 నెలల కోవిడ్ సేవకు 5.0 మార్కులు లభిస్తాయి (నిర్దేశిత పత్రాలు సమర్పిస్తేనే).
ఎలా అప్లై చేయాలి? (How to Apply)
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ap health department jobs 2026
అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి వివరాలతో నింపి, అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను (స్టడీ సర్టిఫికెట్లు 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు తప్పనిసరి) జతచేయాలి.
దరఖాస్తు ఫీజు: OC అభ్యర్థులకు రూ.200/-; SC, ST, BC, EWS, దివ్యాంగులకు రూ.100/-. ఈ మొత్తాన్ని “District Medical and Health Office, Visakhapatnam” పేరుతో డీడీ (DD) తీసి అప్లికేషన్‌కు జతచేయాలి.
పూర్తి చేసిన దరఖాస్తును తేదీ 30-06-2026 సాయంత్రం 05:00 గంటలలోపు “జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలయము, విశాఖపట్నం” నందు స్వయంగా సమర్పించాలి. ap health department jobs 2026
ముఖ్యమైన తేధీలు (Important dates)
నోటిఫికేషన్ విడుదల తేదీ: 20.06.2026
దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 30.06.2026 (సాయంత్రం 5 గంటల వరకు)
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే ప్రయోజనాలు (Advantages)
ప్రభుత్వ ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే మంచి అవకాశం లభిస్తుంది. ap health department jobs 2026
ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు రూ. 32,670/- లతో కూడిన ఆకర్షణీయమైన గౌరవ వేతనం అందుతుంది.
భవిష్యత్తులో వచ్చే ఇతర ప్రభుత్వ నోటిఫికేషన్లలో ఇక్కడ చేసిన కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ సర్వీస్ తాలూకు వెయిటేజీ మార్కులు కలిసొచ్చే అవకాశం ఉంటుంది.
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే లోపాలు (Disadvantages)
ఇవి పూర్తిగా ఒక ఏడాది కాల పరిమితి గల తాత్కాలిక (కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్) ఉద్యోగాలు మాత్రమే. ap health department jobs 2026
నిబంధనల ప్రకారం ఎలాంటి శాశ్వత ఉద్యోగ హక్కులు లేదా క్రమబద్ధీకరణ వర్తించవు.
FNO మరియు శానిటరీ అటెండర్ పోస్టులకు కేటాయించిన వేతనం (రూ. 15,000/-) కొంత తక్కువగా అనిపించవచ్చు.
| ముఖ్యమైన లింకులు (Important Links) | లింక్ |
|---|---|
| అఫీషియల్ నోటిఫికేషన్ PDF (Official Notification) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
| అఫిసియల్ వెబ్సైట్ లింక్ (Official website) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.
ap health department jobs 2026 – తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
ఈ నోటిఫికేషన్‌కు ఇతర జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చా?
ర్హత గల ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ స్థానిక అభ్యర్థుల (Local Candidature) నిబంధనలు మరియు నివాస/స్టడీ సర్టిఫికేట్ నిబంధనల ప్రకారం మెరిట్ జాబితా రూపొందించబడుతుంది. 4 నుండి 10వ తరగతి స్టడీ సర్టిఫికెట్లు తప్పనిసరి.
నివాస ధృవీకరణ పత్రం (Residence Certificate) సమర్పించవచ్చా?
అభ్యర్థి పాఠశాలలో చదివి ఉంటే నివాస ధృవీకరణ పత్రాలు అంగీకరించబడవు, ఖచ్చితంగా 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లను సమర్పించాలి. రెగ్యులర్ స్కూలింగ్ లేని వారికి మాత్రమే నిబంధనల ప్రకారం రెసిడెన్స్ సర్టిఫికెట్ పరిశీలిస్తారు.
అప్లికేషన్ ఫీజు ఎలా చెల్లించాలి?
అప్లికేషన్ ఫీజును "District Medical and Health Office, Visakhapatnam" పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో తీసి దరఖాస్తు ఫారమ్‌కు జత చేయాలి.




