Airport Authority AAICLAS Recruitment 2026: 12th Pass Jobs in Tirupati and Other Airports | great opportunity.

ఎయిర్‌పోర్ట్ అథారిటీ (AAICLAS) లో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: ఇంటర్ అర్హతతో మంచి శాలరీతో అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టులు! AAICLAS Recruitment 2026

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన AAI కార్గో లాజిస్టిక్స్ & అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాలలో అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు కొంచెం హార్డ్ వర్క్ ఉండే అవకాశం ఉంటుంది ఇస్టపడితేనే అప్లై చేసుకోండి. AAICLAS Recruitment 2026

ముఖ్యమైన వివరాలు (Overview):

  • పోస్టు పేరు: అసిస్టెంట్ (సెక్యూరిటీ) AAICLAS Recruitment 2026
  • మొత్తం ఖాళీలు: 62 (తిరుపతి-09, తిరుచిరాపల్లి-23, మదురై-09, భువనేశ్వర్-09, ఉదయ్‌పూర్-12) ఆంధ్రప్రదేశ్ లో కూడా ఖాళీలు కలవు.
  • ఉద్యోగ స్వభావం: 3 ఏళ్ల ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ (పనితీరును బట్టి పొడిగించే అవకాశం ఉంది)
  • పని ప్రదేశం: ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి

latest andhra pradesh jobs ! apply now

అర్హతలు (Eligibility Criteria)

  • విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి (ఇంటర్) ఉత్తీర్ణత ఉంటే చాలు. AAICLAS Recruitment 2026
    • జనరల్ అభ్యర్థులకు కనీసం 60% మార్కులు ఉండాలి.
    • SC/ST అభ్యర్థులకు కనీసం 55% మార్కులు ఉండాలి.
  • వయస్సు (01.06.2026 నాటికి): గరిష్టంగా 27 ఏళ్లు మించకూడదు.
    • SC/STలకు 5 ఏళ్లు, OBCలకు 3 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది.
  • భాష: ఇంగ్లీష్, హిందీ లేదా స్థానిక భాషపై అవగాహన ఉండాలి.

జీతభత్యాలు (Remuneration)

ఎంపికైన అభ్యర్థులకు నెలకు నిర్ణీత జీతం (Consolidated Pay) చెల్లిస్తారు: AAICLAS Recruitment 2026

  • మొదటి సంవత్సరం: రూ. 21,500/-
  • రెండవ సంవత్సరం: రూ. 22,000/-
  • మూడవ సంవత్సరం: రూ. 22,500/-
  • అదనపు ప్రయోజనాలు: మెడికల్ ఇన్సూరెన్స్ (రూ. 10,000 వరకు), సెలవులు మరియు ప్రయాణ భత్యాలు ఉంటాయి.

జాబ్ ప్రొఫైల్ (చేయాల్సిన పనులు )

అభ్యర్థులు గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఇది కేవలం సెక్యూరిటీ విధులే కాకుండా శారీరక శ్రమతో కూడిన పని. విమానాశ్రయంలో ప్రయాణికుల లగేజీని ఎత్తడం, ఎక్స్‌రే మెషీన్ల వద్ద లోడింగ్ మరియు అన్లోడింగ్ వంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఈ పనులు చేయడానికి ఇష్టపడే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. AAICLAS Recruitment 2026

దరఖాస్తు ఫీజు

  • General మరియు OBC: రూ. 500/-
  • SC/ST, EWS మరియు మహిళా అభ్యర్థులు: రూ. 100/-
  • ఫీజును ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. AAICLAS Recruitment 2026

అభ్యర్థులకు ముఖ్య సూచనలు

  1. మార్కుల నమోదు: దరఖాస్తు ఫారంలో ఇంటర్ మార్కులను కేవలం పర్సంటేజ్ (%) రూపంలోనే ఇవ్వాలి, CGPA ఇవ్వకూడదు. AAICLAS Recruitment 2026
  2. ఒక లొకేషన్ మాత్రమే: అభ్యర్థులు ఏదైనా ఒక విమానాశ్రయానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  3. ఫోటో & సంతకం: స్కాన్ చేసిన ఫోటో మరియు సంతకం 20KB కంటే తక్కువ సైజులో ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి? ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.aaiclas.aero సందర్శించి, ‘Career’ విభాగంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Latest govt jobs – apply now !

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 11.06.2026
  • దరఖాస్తుకు చివరి తేదీ: 02.07.2026

📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోండి. మా వెబ్‌సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.

📢 మాతో కనెక్ట్ అవ్వండి (Join Our Groups):

📌 Important Note: Please apply only after checking the official website for each notification. We provide information only through our website and channel.

📝 If you have any doubts regarding this notification, please comment and I will definitely reply.

📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.

Don’t forget to Like, Share and Subscribe! 🔔

Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top