GGH Vizianagaram Recruitment 2026: విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు..AP Govt hospital Jobs 2026.
విజయనగరంలోని ప్రభుత్వ బోధనా సర్వజన ఆసుపత్రి (GGH) లోని డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి కాంట్రాక్ట్ విధానంలో భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ముఖ్యమైన వివరాలు (Key Details)
| organisation | వైద్య విద్యా శాఖ, ప్రభుత్వ బోధనా సర్వజన ఆసుపత్రి, విజయనగరం |
| post name | డాక్టర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, కౌన్సిలర్, పీర్ ఎడ్యుకేటర్, వార్డ్ బాయ్, యోగా థెరపిస్ట్, చౌకీదార్, హౌస్ కీపింగ్ స్టాఫ్ |
| total vacancies | 09 పోస్టులు |
| last date | 29-05-2026 (సాయంత్రం 5:00 గంటల వరకు) |
| qualification | పోస్టును బట్టి 5వ తరగతి, 8వ తరగతి, డిగ్రీ, సామాజిక శాస్త్రాలలో పీజీ, MBBS |
| salary | pay scale | పోస్టును బట్టి |
| category | కాంట్రాక్ట్ ఉద్యోగాలు |
| district | ఉమ్మడి విజయనగరం జిల్లా |
ఉద్యోగాల వివరాలు (Post Details)
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 పోస్టులను భర్తీ చేస్తున్నారు: AP Govt hospital Jobs 2026
- డాక్టర్ (Fulltime): 01 పోస్టు (వేతనం: రూ. 60,000/-)
- ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వోకేషనల్ కౌన్సిలర్: 01 పోస్టు (వేతనం: రూ. 25,000/-)
- కౌన్సిలర్ / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్: 01 పోస్టు (రోస్టర్ పాయింట్: 04-BC-A, వేతనం: రూ. 17,500/-)
- పీర్ ఎడ్యుకేటర్: 01 పోస్టు (వేతనం: రూ. 10,000/-)
- వార్డ్ బాయ్ (Ward Boy): 01 పోస్టు (రోస్టర్ పాయింట్: 04-BC-A, వేతనం: రూ. 13,000/-)
- యోగా థెరపిస్ట్ / డాన్స్ / మ్యూజిక్ / ఆర్ట్ టీచర్: 01 పోస్టు (వేతనం: రూ. 5,000/-)
- చౌకీదార్ (Chowkidar): 02 పోస్టులు (రోస్టర్ పాయింట్: 01-OC, 02-SC Group-1, వేతనం: రూ. 9,000/-)
- హౌస్ కీపింగ్ స్టాఫ్: 01 పోస్టు (వేతనం: రూ. 9,000/-)
latest andhra pradesh jobs ! apply now
అర్హతలు (Eligibility)
విద్యా అర్హతలు: AP Govt hospital Jobs 2026
- Doctor: MBBS డిగ్రీతో పాటు మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. నియామకం జరిగిన 3 నెలల లోపు MOSJE/NISD నిర్వహించే శిక్షణకు హాజరుకావాలి.
- Project Coordinator: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత సెంటర్ల నిర్వహణలో 3 సంవత్సరాల అనుభవం మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
- Counselor/Social Worker/Psychologist: సోషల్ వర్క్ లేదా సైకాలజీలో గ్రాడ్యుయేషన్ (పీజీ కి ప్రాధాన్యత) మరియు 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇంగ్లీష్ మరియు ప్రాంతీయ భాషపై పట్టు అవసరం.
- Peer Educator: చదువు రాయడం తెలిసి ఉండాలి. 1-2 సంవత్సరాల పాటు మాదకద్రవ్యాలకు దూరంగా ఉన్న పూర్వపు డ్రగ్ యూజర్ అయి ఉండాలి.
- Ward Boy: 8వ తరగతి ఉత్తీర్ణత మరియు హాస్పిటల్స్ లేదా డీ-అడిక్షన్ సెంటర్లలో పనిచేసిన అనుభవం ఉండాలి.
- Yoga/Dance/Music/Art Teacher: సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- Chowkidhar: 5వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎక్స్-సర్వీస్‌మెన్ లేదా హోంగార్డు/సివిల్ డిఫెన్స్ శిక్షణ పొంది ఉండాలి మరియు సైకిల్ తొక్కడం రావాలి (పురుషులు మాత్రమే అర్హులు).
- Housekeeping staff: కనీసం 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి (01.07.2025 నాటికి):
- గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు.
- వయోపరిమితి సడలింపులు: SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు; వికలాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్‌కు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అన్ని సడలింపులు కలిపి గరిష్ట వయస్సు 52 సంవత్సరాలు మించకూడదు.
స్థానికత (Local Candidate):
- ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్థానిక విద్యాలయాల్లో చదివిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. AP Govt hospital Jobs 2026
ఎంపిక విధానం (Selection Process)
మొత్తం మార్కులు: 100 మార్కులు.
75% మార్కులు: అర్హత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా కేటాయిస్తారు. (వార్డ్ బాయ్, చౌకీదార్, హౌస్ కీపింగ్ పోస్టులకు కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక ఉంటుంది) .
గరిష్టంగా 10 మార్కులు: అర్హత సాధించిన తర్వాత పూర్తయిన ప్రతి సంవత్సరానికి 1.0 మార్కు చొప్పున సీనియారిటీ వెయిటేజీ ఇస్తారు.
గరిష్టంగా 15 మార్కులు: ప్రభుత్వ సంస్థలలో కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ పద్ధతిలో చేసిన సేవలకు వెయిటేజీ ఇస్తారు. (గిరిజన ప్రాంతాల్లో 6 నెలలకు 2.5 మార్కులు , గ్రామీణ ప్రాంతాల్లో 2.0 మార్కులు , పట్టణ ప్రాంతాల్లో 1.0 మార్కు ). కోవిడ్ విధులు నిర్వహించిన వారికి ప్రత్యేక వెయిటేజీ ఉంటుంది. AP Govt hospital Jobs 2026
ఎలా అప్లై చేయాలి? (How to Apply)
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- పూర్తిగా నింపిన అప్లికేషన్‌కు అన్ని అవసరమైన సర్టిఫికెట్ల (SSC, విద్యార్హతలు, కుల ధృవీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్లు మొదలైనవి) స్వయం ధృవీకరణ (Self-Attested) నకళ్లను జత చేయాలి.
- దరఖాస్తులను స్టాప్లర్ చేయకూడదు, కేవలం టాగ్ లేదా దారంతో మాత్రమే కట్టాలి.
- అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ (DD) లేదా బ్యాంకర్స్ చెక్ రూపంలో “Hospital Development Society, Govt. Teaching General Hospital, Vizianagaram” పేరుతో తీయాలి.
- పూర్తి చేసిన దరఖాస్తులను విజయనగరంలోని ప్రభుత్వ బోధనా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలోని ప్రత్యేక కౌంటర్లలో స్వయంగా గానీ లేదా పోస్ట్/కొరియర్ ద్వారా గానీ సమర్పించాలి. AP Govt hospital Jobs 2026
దరఖాస్తు రుసుము (Application Fee):
- OC అభ్యర్థులు: రూ. 300/-
- SC / ST / BC అభ్యర్థులు: రూ. 200/-
- వికలాంగులు (Physically Challenged): రూ. 100/-
ముఖ్యమైన తేధీలు (Important dates)
నోటిఫికేషన్ విడుదల తేదీ: 21-05-2026
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 21-05-2026
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 29-05-2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
తాత్కాలిక మెరిట్ జాబితా ప్రచురణ: 04-06-2026
అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ: 06-06-2026
తుది మెరిట్ జాబితా ప్రచురణ: 09-06-2026
కౌన్సెలింగ్ తేదీ: 15-06-2026. AP Govt hospital Jobs 2026
ముఖ్యమైన లింకులు (Important Links)
| అఫీషియల్ నోటిఫికేషన్ PDF (Official Notification) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
| అప్లికేషన్ లింక్ (Apply Offline) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.
GGH Vizianagaram Recruitment 2026 – తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు శాశ్వతమైనవా?
కాదు, ఇవి కేవలం ఒక సంవత్సరం కాలపరిమితి గల కాంట్రాక్ట్ ఆధారిత ఉద్యోగాలు. ప్రభుత్వ నిబంధనలు మరియు మీ పనితీరు ఆధారంగా ఈ ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది.
ఇతర జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చా?
లేదు. ఈ నోటిఫికేషన్ ప్రకారం కేవలం ఉమ్మడి విజయనగరం జిల్లాకు (Erstwhile Vizianagaram District) చెందిన స్థానిక అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తులను ఆన్లైన్లో సర్పించవచ్చా?
లేదు
. దరఖాస్తు ఫారమ్‌ను వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని , పూర్తిగా నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి విజయనగరం GGH సూపరింటెండెంట్ కార్యాలయంలో నేరుగా గానీ లేదా పోస్ట్/కొరియర్ ద్వారా గానీ (ఆఫ్‌లైన్ మోడ్‌లో) సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు ఎంత మరియు ఎలా చెల్లించాలి?
ఓసి (OC) అభ్యర్థులకు రూ. 300/-, ఎస్సీ/ఎస్టీ/బీసీ (SC/ST/BC) అభ్యర్థులకు రూ. 200/-, మరియు వికలాంగులకు రూ. 100/- దరఖాస్తు రుసుము ఉంటుంది. దీనిని “Hospital Development Society, Govt. Teaching General Hospital, Vizianagaram” పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ (DD) లేదా బ్యాంకర్స్ చెక్ రూపంలో తీసి అప్లికేషన్‌కు జతచేయాలి.
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ ఎప్పుడు?
దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 29-05-2026 సాయంత్రం 5:00 గంటల వరకు. చివరి నిమిషం రద్దీని నివారించడానికి అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.




