DMHO Jangaon Recruitment 2026: తెలంగాణ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని జనగామ జిల్లా వైద్యారోగ్య అధికారి (DM&HO) కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification No. 11/2026) విడుదల చేసింది. ఇందులో భాగంగా MLHP/CHO/MO, సైకియాట్రిస్ట్, ఫిజీషియన్స్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ వంటి మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిర్దేశిత ఫార్మాట్లో దరఖాస్తును పూర్తి చేసి చివరి తేదీ లోపు సమర్పించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన వివరాలు (Key Details)
| organisation | District Medical & Health Office (DM&HO), Jangaon under NHM, Telangana |
| post name | MLHP/CHO/MO, Psychiatrist, Physicians (MBBS/MD), Lab Technician |
| total vacancies | 10 |
| last date | 25-09-2026 (సాయంత్రం 5:00 గంటల వరకు) |
| qualification | MBBS / BAMS / B.Sc Nursing / GNM / MD / సంబంధిత పారామెడికల్ అర్హత |
| salary | pay scale | రూ. 27,300 నుండి రూ. 1,00,000/- వరకు (పోస్టును బట్టి) |
| category | తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు (కాంట్రాక్ట్ / ఔట్సోర్సింగ్) |
| who will apply | అర్హత కలిగిన స్థానిక / తెలంగాణ అభ్యర్థులు |
latest government jobs 2026 – apply now!
ఉద్యోగాల వివరాలు (Post Details)
MLHP/CHO/MO (పల్లె దవాఖాన): 06 పోస్టులు (వేతనం: రూ. 40,000/- డాక్టర్లకు; రూ. 29,900/- స్టాఫ్ నర్సులకు). DMHO Jangaon Recruitment 2026
సైకియాట్రిస్ట్ (Psychiatrist): 01 పోస్ట్ (వేతనం: రూ. 1,00,000/-)
ఫిజీషియన్స్ (Physicians – MBBS/MD): 01 పోస్ట్ (వేతనం: రూ. 52,000/- నుండి రూ. 72,850/-)
ల్యాబ్ టెక్నీషియన్ (Lab Technician): 02 పోస్టులు (వేతనం: రూ. 27,300/-)
అర్హతలు (Eligibility)
విద్యార్హతలు: DMHO Jangaon Recruitment 2026
- MLHP / MO: MBBS లేదా BAMS (తెలంగాణ మెడికల్ కౌన్సిల్/బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో రిజిస్టర్ అయి ఉండాలి). డాక్టర్లు అందుబాటులో లేకపోతే B.Sc Nursing (2020 తర్వాత ఉత్తీర్ణులైన వారు) లేదా B.Sc Nursing/GNM తో పాటు 6 నెలల CPCH బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు.
- ఇతర పోస్టులు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంబంధిత విభాగంలో MD/MBBS/డిప్లొమా/డిగ్రీ మరియు కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
వయోపరిమితి (01.07.2026 నాటికి): DMHO Jangaon Recruitment 2026
- కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
- దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు కలదు.
- ఎక్స్-సర్వీస్మెన్, NCC ఇన్స్ట్రక్టర్లకు నిబంధనల ప్రకారం 3 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం (Selection Process)
మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించబడుతుంది. DMHO Jangaon Recruitment 2026
మొత్తం 100 మార్కులకు గాను: 90 మార్కులు రాత పరీక్షలో సాధించిన మార్కులకు కేటాయించబడతాయి. మిగిలిన 10 మార్కులు అభ్యర్థి వయస్సు మరియు క్వాలిఫైయింగ్ పరీక్ష ఆధారంగా కేటాయిస్తారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్ (RoR) మరియు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు.
ఎలా అప్లై చేయాలి? (How to Apply)
జనగామ జిల్లా అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫారమ్ను డౌన్లోడ్ చేసుకోండి. DMHO Jangaon Recruitment 2026
దరఖాస్తును అన్ని వివరాలతో క్షుణ్ణంగా పూర్తి చేసి, సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలపై సెల్ఫ్ అటెస్టేషన్ చేసి జతపరచండి.
పూర్తి చేసిన దరఖాస్తును నేరుగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా “District Medical & Health Office, 1st Floor, Collectorate, Jangaon District” చిరునామాలో అందజేయాలి.
దరఖాస్తును 25.09.2026 సాయంత్రం 5.00 గంటలలోపు సమర్పించాలి.
రాత పరీక్ష 27.09.2026 న ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు మెయిన్ కాన్ఫరెన్స్ హాల్, IDOC కాంప్లెక్స్, కలెక్టరేట్, జనగామ నందు జరుగుతుంది. అభ్యర్థులు ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ మరియు పెన్నుతో హాజరుకావాలి.
ముఖ్యమైన తేధీలు (Important dates)
నోటిఫికేషన్ విడుదల తేదీ: 18-09-2026
దరఖాస్తులు ప్రారంభం: 19-09-2026
దరఖాస్తుకు చివరి తేదీ: 25-09-2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
రాత పరీక్ష తేదీ: 27-09-2026 (ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు)
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే ప్రయోజనాలు (Advantages)
ప్రభుత్వ వైద్యారోగ్య విభాగంలో పని చేసిన అనుభవం లభిస్తుంది. DMHO Jangaon Recruitment 2026
విద్యార్హతలకు తగిన విధంగా ఆకర్షణీయమైన గౌరవ వేతనం అందుతుంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించే మంచి అవకాశం లభిస్తుంది.
భవిష్యత్తులో వచ్చే ఖాళీల కోసం ఈ ప్యానెల్ జాబితాను ఒక సంవత్సరం వరకు పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే లోపాలు (Disadvantages)
ఈ నియామకం పూర్తిగా 1 సంవత్సరం కాలపరిమితికి కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన మాత్రమే ఉంటుంది (శాశ్వత ఉద్యోగం కాదు).
ఈ ఉద్యోగాలకు బదిలీ సౌకర్యం ఉండదు.
నోటీసు వ్యవధి (30 రోజులు) ఆధారంగా ఎప్పుడైనా సర్వీస్ రద్దు చేసే అవకాశం ఉంటుంది.
| ముఖ్యమైన లింకులు (Important Links) | లింక్ |
|---|---|
| అఫీషియల్ నోటిఫికేషన్ PDF (Official Notification) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
| అప్లికేషన్ లింక్ (Application Link) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్సైట్ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.
DMHO Jangaon Recruitment 2026 – తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు?
DMHO జనగామ పరిధిలో MLHP, సైకియాట్రిస్ట్, ఫిజీషియన్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ విభాగానికి సంబంధించి మొత్తం 10 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
రాత పరీక్ష ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
రాత పరీక్ష 27-09-2026 న ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు మెయిన్ కాన్ఫరెన్స్ హాల్, IDOC కాంప్లెక్స్, కలెక్టరేట్, జనగామ నందు జరుగుతుంది.
దరఖాస్తును ఆన్లైన్లో చేయవచ్చా?
లేదు, అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని భర్తీ చేసి, జిల్లా కలెక్టరేట్లోని DM&HO కార్యాలయంలో స్వయంగా లేదా పోస్టు ద్వారా మాత్రమే సమర్పించాలి.




