ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన అనంతపురము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ (DM&HO) నుండి ఐడీఎస్‌పీ-డీఎస్‌యూ (IDSP-DSU) విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉంటే అప్లై చేయండి. AP medical & health jobs notification 2026
ముఖ్యమైన వివరాలు (Key Details)
| organisation | డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (DM&HO), అనంతపురము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
| post name | డేటా మేనేజర్ (Data Manager), ల్యాబ్ అసిస్టెంట్ (Lab Assistant) |
| total vacancies | 02 పోస్టులు |
| last date | 30-06-2026 (సాయంత్రం 5:30 గంటల లోపు) |
| qualification | పోస్ట్ గ్రాడ్యుయేషన్ (కంప్యూటర్ సైన్స్) / BE (IT/Electronic) లేదా ఇంటర్మీడియట్ (ల్యాబ్ అసిస్టెంట్ వోకేషనల్ కోర్స్) / ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ |
| salary | pay scale | పోస్టుని అనుసరించి శాలరీ ఉంటుంది |
| category | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు (కాంట్రాక్ట్ బేసిస్) |
| who will apply | అర్హత కలిగిన ఉమ్మడి అనంతపురం జిల్లా అభ్యర్థులు |
latest government jobs 2026 – apply now!
ఉద్యోగాల వివరాలు (Post Details)
ఉమ్మడి అనంతపురము జిల్లా పరిధిలోని ఆరోగ్య సంస్థలలో ఖాళీగా ఉన్న క్రింది పోస్టులను భర్తీ చేస్తున్నారు: AP medical & health jobs notification 2026
- డేటా మేనేజర్ (Data Manager) – IDSP: 01 పోస్టు (OC) – జీతం: నెలకు రూ. 36,225/-
- ల్యాబ్ అసిస్టెంట్ (Lab Assistant) – IDSP: 01 పోస్టు (OC) – జీతం: నెలకు రూ. 15,000/-
అర్హతలు (Eligibility)
వయోపరిమితి: AP medical & health jobs notification 2026
01-06-2026 నాటికి 40 సంవత్సరాల లోపు ఉండాలి.
- SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు కలదు.
విద్యార్హతలు: AP medical & health jobs notification 2026
- డేటా మేనేజర్: కంప్యూటర్ సైన్స్‌లో పీజీతో పాటు కనీసం 1 సంవత్సరం అనుభవం లేదా BE (IT/Electronics) ఉత్తీర్ణత.
- ల్యాబ్ అసిస్టెంట్: ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ లేదా ఇంటర్మీడియట్ ల్యాబ్ అసిస్టెంట్ వోకేషనల్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి.
పోస్టుల నెలవారీ జీతాల (Remuneration) వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
- డేటా మేనేజర్ (Data Manager): నెలకు రూ. 36,225/-
- ల్యాబ్ అసిస్టెంట్ (Lab Assistant): నెలకు రూ. 15,000/-
ఎంపిక విధానం (Selection Process)
మొత్తం 100 మార్కులకు గానూ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది:
- 75% మార్కులు: అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా.
- ఉద్యోగ అనుభవం (వెయిటేజీ): ప్రభుత్వ కోవిడ్ సేవలు లేదా కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ సర్వీస్ ఆధారంగా గరిష్టంగా 15% మార్కుల వెయిటేజీ ఇస్తారు.
- సీనియారిటీ వెయిటేజీ: కోర్సు పూర్తి చేసిన సంవత్సరం నుండి ఏడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు.
- డేటా మేనేజర్ పోస్టుకు: జిల్లా NIC అధికారుల ద్వారా 10 మార్కులకు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
ఎలా అప్లై చేయాలి? (How to Apply)
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అప్లికేషన్ పూర్తిగా నింపి, అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలపై (Self-Attested) సంతకాలు చేసి జతపరచాలి.
‘District Medical & Health Officer, Ananthapuramu’ పేరు మీద నిర్దేశించిన ఫీజుకు డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీయాలి (OC, BC లకు రూ. 400/-, SC, ST లకు రూ. 200/-).
పూర్తి చేసిన దరఖాస్తులను DM&HO కార్యాలయం, అనంతపురము నందు నేరుగా సమర్పించి, రశీదు (Acknowledgement) తీసుకోవాలి. AP medical & health jobs notification 2026
ముఖ్యమైన తేధీలు (Important dates)
నోటిఫికేషన్ విడుదల తేదీ: 16-06-2026
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 20-06-2026 (ఉదయం 10:00 గంటల నుండి)
దరఖాస్తుకు చివరి తేదీ: 30-06-2026 (సాయంత్రం 05:30 గంటల వరకు) AP medical & health jobs notification 2026
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే ప్రయోజనాలు (Advantages)
సొంత జిల్లాలోనే (ఉమ్మడి అనంతపురం జిల్లా) ప్రభుత్వ ఆరోగ్య విభాగంలో పనిచేసే అవకాశం లభిస్తుంది. AP medical & health jobs notification 2026
భవిష్యత్తులో వచ్చే ఇతర ప్రభుత్వ నోటిఫికేషన్లలో ఈ కాంట్రాక్ట్ సర్వీస్ కాలానికి సర్వీస్ వెయిటేజీ మార్కులు పొందే అవకాశం ఉంటుంది.
ఈ ఉద్యోగంలో చేరితే కలిగే లోపాలు (Disadvantages)
ఇది కేవలం ఒక సంవత్సరం కాల పరిమితి గల తాత్కాలిక/కాంట్రాక్ట్ ఉద్యోగం మాత్రమే (ప్రభుత్వ నిబంధనల ప్రకారం పొడిగించే అవకాశం ఉంది).
నిర్ణీత ప్రదేశంలో చేరిన తర్వాత కనీసం 6 నెలల పాటు తప్పనిసరిగా పని చేయాల్సి ఉంటుంది.
| ముఖ్యమైన లింకులు (Important Links) | లింక్ |
|---|---|
| అఫీషియల్ నోటిఫికేషన్ PDF (Official Notification) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
| అఫిసియల్ వెబ్సైట్ లింక్ (Official website) | [ఇక్కడ క్లిక్ చేయండి] |
📌 ముఖ్య గమనిక: ప్రతి నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అప్లై చేసుకోండి. మా వెబ్‌సైట్ మరియు ఛానల్ ద్వారా మేము కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము.
📝ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఏ సందేహాలు ఉన్న, మీకు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను.
AP medical & health jobs notification 2026 – తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
ఈ నోటిఫికేషన్ ద్వారా ఏయే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు?
ఈ నోటిఫికేషన్ ద్వారా ఐడీఎస్‌పీ-డీఎస్‌యూ (IDSP-DSU) విభాగంలో డేటా మేనేజర్ (Data Manager) మరియు ల్యాబ్ అసిస్టెంట్ (Lab Assistant) పోస్టులను భర్తీ చేస్తున్నారు.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?
పూర్తి చేసిన దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 30-06-2026 (సాయంత్రం 5:30 గంటల లోపు).
ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలా లేదా ఆఫ్‌లైన్‌లోనా?
ఈ ఉద్యోగాలకు కేవలం ఆఫ్‌లైన్ (Offline) విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసి, అవసరమైన పత్రాలతో పాటు DM&HO కార్యాలయం, అనంతపురము నందు నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు రుసుము (Application Fee) ఎంత?
OC మరియు BC అభ్యర్థులకు రూ. 400/-, SC మరియు ST అభ్యర్థులకు రూ. 200/- ఫీజు కలదు. వికలాంగులకు (Physically Challenged) ఫీజు నుండి మినహాయింపు ఉంది. ఫీజును 'District Medical & Health Officer, Ananthapuramu' పేరున డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో చెల్లించాలి.
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం ఎలా ఉంటుంది? ఎలాంటి పరీక్ష అయినా ఉంటుందా?
అభ్యర్థులను పూర్తిగా క్వాలిఫైయింగ్ మార్కుల మెరిట్, సీనియారిటీ మరియు ప్రభుత్వ సేవల వెయిటేజీ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఉండదు, అయితే డేటా మేనేజర్ పోస్టుకు మాత్రం జిల్లా NIC అధికారుల ద్వారా 10 మార్కులకు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
ఇతర జిల్లాల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చా?
ఈ నియామకాలు ఉమ్మడి అనంతపురం జిల్లా (Erstwhile Ananthapuramu District - అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాలు) పరిధిలోని ఖాళీలకు మాత్రమే పరిమితం. లోకల్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.




